IIT Bombay లోని తెలుగు మిత్రులందరికీ హృదయపూర్వక స్వాగతం.
మా తెలుగు తల్లికి మల్లెపూదండ!
మా కన్న తల్లికి మంగళారతులు!!
మా తెలుగు తల్లికి మల్లెపూదండ!
మా కన్న తల్లికి మంగళారతులు!!
ఏ అంశంలోనైనా కొద్దిపాటి ప్రావీణ్యం కలిగి ఉండి, ఆసక్తి చూపుతూ ముందుకు రాగలవారందరికి ఇదే మా ఆహ్వానం. మన ఆచారాలు, అలవాట్లు ప్రతిబింబించేలా, TelCA ప్రతీ ఏటా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. నిర్వాహక బృందంలో ప్రతీ హాస్టల్ నుండి ప్రాతినిద్యం కలదు. మిగిలిన విషయాల కొరకు మీ హాస్టల్ ప్రతినిధిని సంప్రదించగలరు.
ఉత్సాహంగా పాల్గొనే వారి సంఖ్య ప్రతీ ఏటా పెరుగుతూ వస్తుంది. ఈ సంవత్సరం కూడా రెట్టించిన ఉత్సాహంతో పెద్ద సంఖ్యలో చురుగ్గా పాల్గొనాలని కోరుకుంటున్నాం, పాల్గొంటారని ఆశిస్తున్నాం.
కార్యక్రమాల వివరాలు ఎప్పటికప్పుడు ముందుగానే తెలియజేయబడును.
మరింత సమాచారంతో, నిర్దిష్ట కార్యాచరణతో త్వరలో మీ ముందుంటాం...
జరిగేవి మన కార్యక్రమాలు కాబట్టి అందరం కలిసి జరుపుకుందాం.... అందుకోసం మీ తోడ్పాటు ఎంతైనా అవసరం....
తప్పకుండా మీ సూచనలు, సలహాలతో ముందుకు వస్తారని ఆశిస్తూ...
"చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా, గతమెంతో ఘనకీర్తి కలవోడా"
No comments:
Post a Comment